
పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్,డిసెంబర్, 28:- గిరిజన గ్రామం వెంకటనగరం లో పర్యటించిన ప్రత్తిపాడు వైఎస్ఆర్సిపి నాయకులు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీ కృష్ణంరాజు నిరుపేదలైన గిరిజన మహిళలకు క్రిస్మస్ కానుకగా 50 చీరలు పంపిణీ చేసి తాను రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తూ అందరి మన్ననలను అభిమానాన్ని సంపాదించు కుంటానని నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా మీ కుటుంబంలో ఒకడిగా నిలబడతానని భరోసా కల్పించారు. అనంతరం అదే గ్రామంలో కాలు గాయంతో ఉన్న వార్డు మెంబర్ మాదాసు శివ కు 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ధైర్యం చెప్పి ప్రతి ఒక్కరూ మత బేధాలను విడిచిపెట్టి కలసికట్టుగా ఉండాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షుడు ఏనుగు మార్ని బాబు, వైసీపీ నాయకులు వెలుగుల రాజబాబు, ముప్పిడి నూకరాజు, బైపా దొంగబ్బాయి, మరిపి రెడ్డి శ్రీను, కోలా తాతబాబు, బొల్లు నాగేశ్వరరావు, జువ్వల దొరబాబు, యాళ్ళ ఏసు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.