పయనించే సూర్యుడు న్యూస్ చండూరు డిసెంబర్ 28 గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప పిలుపునిచ్చారు. చండూరు మండలం పడమటి తాళ్ళ కోటయ్య గూడెం గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ నూతన సర్పంచ్ గాలెంక రాంబాబు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పడుతున్న తపనను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం మరియు ప్రజలు అధికారులు పాల్గొన్నారు.
