పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 28.12.3025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ) రాష్ట్రంలోని సత్య ప్రమాణాలకు పేరుగాంచిన మండలంలోని రాజనాల బండ పై శనివారం విశేష పూజలు జరిగాయి టీటీడీ ఆధ్వర్యంలో ఉదయాన్నే ప్రధానార్చకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీ నరసింహ స్వామి క్షేత్రపాలకుడు ప్రసన్న ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొందరు ప్రమాణాలు చేయగా మరికొందరు వాయిదాలు వేసుకొని వెళ్లారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది విశేష సంఖ్యలో వచ్చిన భక్తులకు టీటీడీ సిబ్బంది సేవలు అందించారు