పాలెం జిల్లా పరిషత్ పాఠశాల స్థలాన్ని కాపాడుకుందాం

* కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ అడ్వకేట్ *మంజూరైన ₹1.20 కోట్లతో వెంటనే భవన నిర్మాణం పూర్తి చేయాలి ​విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏకమైన గ్రామస్తులు ​

​పయనించే సూర్యుడు డిసెంబర్ 28 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కె శ్రావణ్ కుమార్ పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిరక్షణ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు పోరుబాట పట్టారు. “మా పాఠశాల మాకే కావాలి – స్కూల్ స్థలం ఏ వ్యాపారస్తునికి చెందకూడదు” అనే నినాదంతో శనివారం పాఠశాల ఆవరణలో భారీ నిరసన మరియు అవగాహన సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోటి 20 లక్షల రూపాయల భారీ నిధులను మంజూరు చేసిందని, అయితే భవన నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం విద్యార్థులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు చెందిన విలువైన భూమిపై కొందరు వ్యాపారస్తుల కన్ను పడిందని, విద్యా నిలయాల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల పరం కానివ్వబోమని వారు హెచ్చరించారు. మంజూరైన నిధులతో యుద్ధ ప్రాతిపదికన భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అడ్వకేట్ బోనాసిస్ రామచందర్, నరసింహారెడ్డి, మల్లికార్జున్ రాజు, మరియు మాజీ సైనికుడు వెంకటయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. గ్రామంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పాఠశాల స్థలాన్ని ఆక్రమించాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ యువత, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *