పయనించే సూర్యుడు డిసెంబర్ 28 కరీంనగర్ న్యూస్: ఆరోగ్యంగా ఉండడం ద్వారా రోజు వారి కార్యకలాపాలను చురుకుగా చేయగలుగుతామని మరియు సమాజాభివృద్ధికి చేయూతనివ్వగలుగుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఎన్నార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు “అల్ఫోర్స్” డా.వి. నరేందర్ రెడ్డి స్థానిక 45వ డివిజన్లో ఎండి అజీమ్ ఆధ్వర్యంలో ప్రముఖ హాస్పిటల్ సన్ రైజ్ హాస్పిటల్ మరియు శరత్ మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య మరియు కంటి శిబిరం ప్రారంభ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని మరియు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకొని చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు సమాజ హితమై కార్యక్రమాలు చేపడుతున్న అజీం ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని విష్ణు గౌడ్, మానకొండూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు అరవింద్ తోర్తి, మానకొండూర్ మండల ఉపాధ్యక్షులు, వార్డు మెంబర్ ముక్కెర సతీష్, తుమ్మల రమేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి అడ్వకేట్ రజనీష్, సంగ్రామ్ సింగ్, మొహమ్మద్ కైరోద్దీన్, సింగమ రాజు హాఫీజ్ రిజ్వాన్ హాఫీజ్ సయ్యద్ అమ్జద్ అంజన్ కుమార్ గడ్డం డివిజన్ నాయకులు మహేష్ ప్రకాష్ గడ్డం శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు