పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 28 బోధన్ : బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్ తండ్రి చీల నాగప్ప పటేల్ శనివారం ఉదయం హున్సా గ్రామంలో అకాల మరణం చెందారు.ఆయన మరణం పట్ల నియోజకవర్గ వివిధ పార్టీ నాయకులు మండల రెవెన్యూ అధికారి మండల ప్రజా పరిషత్ అధికారి పలువురు గ్రామ సర్పంచులు ప్రజా ప్రతినిధులు అధికారులు అనధికారులు బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతక్రియలో పాల్గొన్నారు. మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ధైర్యం చెప్పారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.