జగ్గయ్యపేట మండల పరిషత్ అక్రమాలు పై జిల్లా కలెక్టర్ విచారణ

* జావీద్ పిర్యాదు పై ఉప ముఖ్యమంత్రి ఆదేశం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం డిసెంబర్ 29 జగ్గయ్యపేట పట్టణంలోని ఈరోజు జగ్గయ్యపేట మండల పరిషత్ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యం పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ను విచారణకు ఆదేశించారు. జగ్గయ్యపేట మండల పరిషత్తు కార్యాలయ అధికారులు మరియు ఉద్యోగులు పి జి ఆర్ ఎస్ పై వచ్చే ఫిర్యాదులను సరైన మార్గంలో విచారించకుండా స్వార్ధంతో వ్యవహరిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జగ్గయ్యపేట సామాజిక కార్యకర్త మహమ్మద్ జావిద్ అహ్మద్ ఫిర్యాదు చేశారు. వారు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం జగ్గయ్యపేట మండల పరిషత్ కార్యాలయం తో పాటు వారి పరిధిలో ఉ న్న గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వం ద్వారా వచ్చే పీజీఆర్ఎస్ ఫిర్యాదులను సకాలంలో అధికారులు విచారణ మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నెల రోజుల గడువు ఉన్న ఫిర్యాదులను కూడా ముందస్తుగా నోటీసులు ఇవ్వటం కానీ సమాచారం ఇచ్చి పిలవడం కానీ ఎంపీడీవో మరియు వారి సిబ్బంది పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండల పరిషత్ అధికారులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వారి ఇష్టానుసారంగా ఫిర్యాదులను ముగిస్తూ చేతులు దులుపుకుంటున్నారని. ఉదాహరణకు నేను పీజీఆర్ఎస్ లో ఎన్టీఆర్202511158 పై ప్రభుత్వ కార్యక్రమం స్వర్ణాంధ్ర 2047 పథకంలో మండల పరిషత్తు వారు ఏర్పాటు చేసిన అధికారుల బృందంలో ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా సొంత పనులకే పరిమితమై ప్రభుత్వ జీతాలను పొందుతున్నారనే విషయంపై వీఆర్వో ఆర్.శ్రీనివాసరావు ఈ ఏడాది ఆగస్టు మాసంలో మండల రెవెన్యూ జగ్గయ్యపేట వారి నుండి ఆగస్టు మాసంలో రిలీవ్ అయి మండల పరిషత్తు వారి స్వర్ణాంధ్ర టీం లో హాజరై విధులు నిర్వహించక పోయిన ప్రభుత్వం నుండి జీతాలను చెల్లించడం జరిగిందని తెలిపారు నా ఫిర్యాదు పై ముగించే సమయంలో నాతో ఎంపీడీవో మాట్లాడుతూ విఆర్వో శ్రీనివాసరావు తమ కార్యాలయానికి సంబంధం లేదని వారు రెవిన్యూ కార్యాలయానికి మాత్రమే సంబంధం కలిగిన వారిని తెలియజేసినారు. కనీసం వారు విచారణ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా విధులకు డుమ్మా కొట్టిన వీఆర్వో శ్రీనివాసరావు తో కుమ్మక్కై వారు స్వర్ణాంధ్ర కోసం పనిచేసిన విధులను పరిశీలన చేయకుండానే ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా పి జి ఆర్ ఎస్ ను ముగించారని తెలిపారు. ఈ కార్యాలయ పరిధిలో మరో ఫిజీ ఆర్ ఎస్ లో తిరుమలగిరి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం స్వాహా చేసిన విషయాన్ని పోలీస్ శాఖకు ఫిర్యాదు చేసిన మీదట వారు మండల పరిషత్తు కార్యాలయం వారి నివేదికను కోరి రెండు మాసాలు గడుస్తున్నా నేటికీ పోలీసులకు పంపకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. అలాగే చిలకల్లు గ్రామపంచాయతీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం లేని కొలతలతో పన్ను విధించడంపై వచ్చిన ఫిర్యాదును కూడా నిర్లక్ష్యంగా అధికారులు ముగించడం జరిగింది. ఈ ఈ విధంగా జగ్గయ్యపేట మండల పరిషత్ కార్యాలయ అధికారులు ఉద్యోగులు అదేవిధంగా స్వర్ణాంధ్ర టీం లో ఉన్న వీఆర్వో శ్రీనివాసరావు తో సహా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదు చేయగా వారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పి జి ఆర్ ఎస్ ద్వారా ఆదేశించినారని జావిద్ అహ్మద్ తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *