పయనించే సూర్యుడు డిసెంబర్ 29 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి తేది 27 డిసెంబర్ గీత నగర్ హై స్కూల్ లో జరిగిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 14 ఇయర్స్ బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోరపల్లి విద్యార్థులు జి . వైష్ణవి, లౌక్యశ్రీ, ,8వ తరగతి మరియు అక్షర 7వ తరగతి విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి, వ్యాయమ విద్యా ఉపాధ్యాయులు శ్రీను తెలిపారు , ఈ పోటీలు 28-12-2025 నుండి 29-12-2025 వరకు మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట లో జరుగనున్నాయి విద్యార్థుల ఎంపిక పట్ల ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మెన్, సర్పంచ్, ఉప సర్పంచ్ ,లు హర్షం వ్యక్తం చేశారు గ్రామ యువకులు ,గ్రామప్రజలు అభినందించారు.