పయనించే సూర్యుడు న్యూస్ 29 డిసెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ అంకితభావంతో పనిచేస్తున్న ఇబ్రహీంపట్నం డిపో సిబ్బంది ( డ్రైవర్లు, కండక్టర్లు ) కి శనివారం ప్రగతి చక్ర అవార్డులను డిపో మేనేజర్ వెంకట నరసప్ప అందించారు. విధుల్లో భాగంగా ఈ పీకే, కే ఎమ్ పి ఎల్ సాధించిన సిబ్బందిని డిపో మేనేజర్ వెంకట నరసప్ప ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది క్రమశిక్షణ, పనితీరు ఆర్టీసీ సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నారని అన్నారు. అవార్డులు అందుకోవడం పై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.