పయనించే సూర్యుడు డిసెంబర్ 29 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అశ్వారావుపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జుజ్జురి వెంకన్న బాబును అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకురాలు వగ్గేల పూజ, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి జుజ్జారపు శ్రీరామ్మూర్తి పరామర్శించారు. గత కొన్ని రోజులుగా కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వెంకన్న బాబు, ఇటీవల ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తిరుమలకుంట గ్రామంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వగ్గేల పూజ, జుజ్జారపు శ్రీరామ్మూర్తి ఆయన నివాసానికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంకన్న బాబు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజా క్షేత్రంలోకి రావాలని వారు ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాజీ సర్పంచ్ అభ్యర్థి మాడి ముత్యాల తదితరులు పాల్గొన్నారు