ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

* దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ * తెలంగాణ ఇచ్చిన పార్టీ * ప్రజాపాలన తో ముందుకు నడుస్తున్న పార్టీ

పయనించే సూర్యుడు న్యూస్ 29-12-25, నాగరాజు రుద్రారపు సూర్యాపేట టౌన్ రిపోర్టర్ వ్యవసాయ మార్కభారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్) లో పార్టీ పతకావిష్కరణ చేసిన డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అంటే ప్రజల కోసం పోరాటం, కాంగ్రెస్ అంటే అభివృద్ధి, సంక్షేమం, కాంగ్రెస్ అంటే ప్రజల భవిష్యత్ అని దేశ స్వాతంత్ర్యానికి పునాది వేసి, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఏకైక పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 8న బొంబాయిలో 72 మంది తో ఏర్పడ్డ జాతీయ కాంగ్రెస్ పార్టీ నేడు దేశంలోని 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. దేశ స్వాతంత్రం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రజలను ఐక్యం చేసి బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం తేవడంలో కీలకపాత్ర వహించింది కాంగ్రెస్ అని అన్నారు. ఎంతో మంది స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు అయ్యి కుటుంబాలను, ఆస్తులను త్యాగం చేసి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశంలో ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారని తెలిపారు. ఒకవైపు ప్రజలు కనీస అవసరాలు తీర్చడం, మరోవైపు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసిన సేవలు ప్రజలు మరవలేరన్నారు. 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక పరిపుష్టి గల దేశంగా తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చారు. గాంధీ, నెహ్రూల కలయిక ఈ దేశానికి ఎంతో మేలు చేసిందన్నారు. వేలాది మంది త్యాగం, వారి జైలు జీవితం వారి నిస్వార్థ సేవతోనే నేడు మనం స్వతంత్ర దేశంలో అన్ని హక్కులను అనుభవిస్తూ జీవిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా ఈ దేశంలో ఒక పటిష్టమైన పార్టీగా నెలదొక్కుకుందంటే ఆ పార్టీ మూల సిద్ధాంతాలు.. పార్టీలోని నాయకులు కారణమన్నారు. సోనియమ్మ, పీవీ, మన్మోహన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు దేశం కోసం నిరంతరం శ్రమించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలను తీర్చినా అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అయ్యిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా అధికారంలోకి వచ్చామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *