పయనిచే సూర్యడు డిసెంబర్ 30 అనుమకొండ బ్యూరో రమేష్ గొట్టే తేదీ04-11-2025 రోజున అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల పరకాల ప్రధానోపాధ్యాయులు సిలువేరు సురేందర్ జి.హెచ్.ఎం అధ్యక్షతన సమావేశం జరిగినది. పాఠశాలలో నిరుపయోగంగా వస్తువు సామాగ్రి గురించి చర్చ జరిగినది. చర్చ అనంతరం ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. పాఠశాలలో వినియోగంలో లేని వస్తువులను పాఠశాల నిబంధన ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వేలంపాట ద్వారా విక్రయించుటకు నిర్ణయించడమైనది. వేలంపాట తేదీ నోటీస్ బోర్డు పత్రికా ప్రకటన ద్వారా తెలియపరుస్తున్నాము. తేదీ. డిసెంబర్ 31-2025 రోజున ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొనగలరని విజ్ఞప్తి.