పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)జనగాం జిల్లా, పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోగత మూడు రోజుల క్రితం రేగుల గ్రామం నుండి ఉద్యోగ నిమిత్తం జనగామ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ముత్యం యాకయ్య విధి నిర్వహణలో భాగంగా డ్యూటీకి వెళుతుండగా మార్గమధ్యలో లక్ష 2000 రూపాయల నగదు ఉన్న బ్యాగు , ఐడి కార్డు, విలువైన పత్రాలు మార్గమధ్యలో పోగొట్టుకున్నాడు.వెంటనే ఇట్టి విషయాన్ని పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ పవన్ కుమార్ ను సంప్రదించగా, ఎస్సై లింగారెడ్డి, హోంగార్డు మారయ్యకు ఇట్టి బ్యాగును వెతికి అతనికి అప్పగించాల్సిందిగా చెప్పనైనది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్సై లింగారెడ్డి,హోంగార్డు మారయ్య దర్దేపల్లి గ్రామంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు చూసి ముత్యం యాకయ్య బైక్ మీద వెళుతుండగా పోగొట్టుకున్న బ్యాగు ను సీసీ కెమెరాలు ద్వారా కనిపెట్టి అట్టి బ్యాగులో ఉన్నటువంటి లక్ష రెండు వేల రూపాయల నగదు, ఐడికార్డ్స్ విలువైన పత్రాలను ఎస్సై లింగారెడ్డి ద్వారా అప్పగించడం అయినది, ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ ముత్యం యాకయ్య మాట్లాడుతూ నేను డ్యూటీకి వెళుతుండగా పోగొట్టుకున్న డబ్బులు ఉన్న బ్యాగును సీసీ కెమెరాల ద్వారా దొరకబట్టి నాకు అప్పగించిన పాలకుర్తి పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపినాడు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి సీసీ కెమెరాలు చూసి పోగొట్టుకున్న బ్యాగును అప్పగించడంలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ రవి హోంగార్డు మారయ్యను ఎస్ఐ పవన్ కుమార్, లింగారెడ్డి లు అభినందించారు