పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ డిసెంబర్ 30 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణంలోని శ్రీ చెన్నకేశవ నాద పంచముఖ లింగేశ్వర స్వామి ఆలయ మంటప ఆవరణలో చండీ పరివార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల భక్తుల సహకారంతో అయ్యప్పకు ఇష్టమైన శాస్తా ప్రీతి మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి స్వాములందరూ మంటపములోకి ఆహ్వానించారు.. బ్రహ్మశ్రీ మునుగోటి సత్యనారాయణ శర్మ గురుత్వంలో ఉదయం ధ్వజారోహణం, గణపతి హోమం, అష్ట శాస్త ఆరాధన సాయంత్రం స్వామివారి అభిషేకం మహా పడిపూజ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. మధ్యాహ్నం పూజ లో పాల్గొన్న స్వాములకు భక్తులకు అన్న ప్రసాదం సాయంత్రం అల్పా హారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పుర ప్రముఖులు, స్వాములు, పరివార సభ్యులు తదితరులు పాల్గొన్నారు.