పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం డిసెంబర్ 30 జగ్గయ్యపేట మండలం కే. అగ్రహారం గ్రామంలో ఎల్ పి నెంబర్ 65 పాత సర్వే నంబర్ 102/1ఏ పేరుతో ప్రభుత్వానికి చెందిన సుమారు ఎకరం భూమిని అక్రమంగా రెవిన్యూ రికార్డులలో లాహోరీ హనుమంత్ నాయక్ హక్కు పొందటంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు జి. విజయరాజు కోరారు. పిజిఆర్ఎస్లో చేసిన వివరాలను ఆయన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం కౌత వారి అగ్రహారం గ్రామంలో సర్వేనెంబర్.102/1ఏ లో ది. 30-09 -2022 వ తేదీన మల్లవల్లి జార్జి గారి ద్వారా య. 2.36 సెంట్లు భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని,దీని ప్రకారం రెవెన్యూ అడంగల్ మరియు ఇతర రికార్డులలో అదే విస్తీర్ణాన్ని రైతు లాహోరి హనుమంత్ నాయక్ పేరులో రెవెన్యూ అధికారులు నమోదు చేయకుండా అదనంగా ప్రభుత్వ భూమిని కలిపి హనుమంతు నాయక్ జగ్గయ్యపేట మండల రెవెన్యూ కార్యాలయం వారి సహకారంతో అక్రమంగా రెవిన్యూ రికార్డులలో ఎక్కించడం జరిగిందని తెలిపారు. దీనిపై ప్రత్యేక విచారణ జరిపించాలని, అగ్రహారం గ్రామంలో ఎల్ పి నెంబర్ 65 పై హనుమంత్ నాయక్ ఆ భూమిని విక్రయించకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిస్ప్యూట్ రిజిస్టర్లో నమోదు చేసేలా జగ్గయ్యపేట తాసిల్దార్ వారికి ఆదేశాలు జారీ చేయాలని, ప్రభుత్వ భూమిని అక్రమంగా పొందిన హనుమంత్ నాయక్ పై అలాగే వారికి సహకరించిన రెవెన్యూ శాఖ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరారు.