గొర్రెలు–మేకల్లో నట్టల నివారణ తప్పనిసరి

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ డిసెంబర్ 29 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం అల్లీపూర్‌ లో డీవర్మింగ్ కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్ గౌతమి వెంకట్ రెడ్డి. తెలంగాణ పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు మేకల్లో నట్టల నివారణ (డీవర్మింగ్) కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమి వెంకట్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డా. బి. ప్రకాష్ కార్యక్రమాన్ని పరిశీలించి, గొర్రెలు–మేకల్లో డీవర్మింగ్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నట్టల నివారణ వల్ల పశువుల ఆరోగ్యం మెరుగు పడడంతో పాటు బరువు పెరుగుదల, మాంస ఉత్పత్తి, ప్రజనన సామర్థ్యం పెరుగుతాయని, నట్టల కారణంగా కలిగే రోగాలు, మరణాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.సర్పంచ్ గౌతమి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి గొర్రెలు మేకల పెంపకదారుడు శాఖ సూచనల మేరకు కాలానుగుణంగా తప్పనిసరిగా డీవర్మింగ్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గంగా రెడ్డి, వెంకటేశ్వర్లు,ఎంబారి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ వినయ్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు,గొర్రెల పెంపకదారులు పంతంగి మల్లయ్య, పంతంగి మనోజ్, చెల్కల భీమయ్య తదితరులు పాల్గొన్నారు.పశువైద్యాధికారి డా. నరేష్ రెడ్డి గడ్డం, సిబ్బంది శివ కుమార్, అహ్మద్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ గొర్రెలు–మేకల పెంపకదారులకు శాఖ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *