పయనించే సూర్యుడు డిసెంబర్ 30 ఆదోని రూరల్ రిపోర్టర్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో చూపుతున్న అద్భుత ప్రతిభ, నిబద్ధత, ప్రొఫెషనల్ సర్వీస్ మరియు అనేక ఈవెంట్స్‌లో సాధించిన విజయాలకు గాను జాతీయ స్థాయి గుర్తింపు పొందారు.దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే “ఇండియా బిజినెస్ ఐకాన్ అవార్డు ను ఉదయ్ కిరణ్ ఈ నెల 27వ తేదీన, బెంగళూరులో జరిగిన గ్రాండ్ అవార్డ్స్ సెరిమనీలో అందుకున్నారు. ఈ అవార్డు కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలు, ఈవెంట్ మేనేజర్లు, క్రియేటివ్ ఎంట్రప్రెన్యూర్లు పోటీపడ్డ సందర్భంలో, ఉదయ్ కిరణ్ తన ప్రత్యేక పనితనం, ప్రమాణాలకు కట్టుబాటు, కస్టమర్స్‌కు అందించే నమ్మకం మరియు అత్యుత్తమ సేవల కారణంగా ఎంపిక కావడం విశేషం.అనేక వివాహాలు, ఫంక్షన్లు, కార్పొరేట్ ఈవెంట్స్‌ను అత్యుత్తమ ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించడం కస్టమర్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టే ప్రొఫెషనల్ అటిట్యూడ్పద్మగిరి ఈవెంట్స్ ను ఆదోని మరియు పరిసర ప్రాంతాల్లో విశ్వసనీయ ఈవెంట్ బ్రాండ్‌గా నిర్మించడంయువతకు ప్రేరణగా నిలిచే నాయకత్వ లక్షణాలు & కష్టపడి ఎదిగిన ప్రయాణం ఈ అవార్డును స్వీకరించిన అనంతరం ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ,నా విజయం నా టీమ్, నా కుటుంబం, నా క్లయింట్లు మరియు ఆదోని ప్రజల సహకార ఫలితం. ఈ అవార్డు నన్ను మరింత బాధ్యతతో ముందుకు నడిపిస్తుంది” అని అన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక నేషనల్ అవార్డు సాధించడం ద్వారా ఆదోని పట్టణానికి గర్వకారణమైన గుర్తింపు వచ్చింది.
