పయనించే సూర్యుడు డిసెంబర్ 30 ఉట్నూర్ ఉట్నూర్: ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ మస్రత్ అన్సార్ అలీతో పాటు వార్డు సభ్యులకు ఖానాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఉప సర్పంచ్ స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిర్మల్ డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో యువత అధికంగా గెలుపొందడం ఆనందకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అరకిల్ల పరమేశ్వర్ రావు ఉట్నూర్ మండల అధ్యక్షుడు తిగుట్ల రాజ్ కుమార్ నాయకులు ఫహీమ్ జాదవ్ కృష్ణ కాంత్ ఉప సర్పంచ్ మస్రత్ అన్సార్ అలీ వార్డు సభ్యులు నారా సాయి అన్వేష్ చుంచు రాజు పందిరి భీమన్న కళావతి తదితరులు పాల్గొన్నారు.