న్యూ ఇయర్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు

* న్యూ ఇయర్ పేరుతో హద్దులు మీరితే కఠిన చర్యలు * సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 శింగనమల నూతన సంవత్సర వేడుకలు పోలీస్ వ్యవస్థ నిబంధనలు ప్రజలు పాటించాలి నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తూ, హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవని శింగనమల సీఐ కౌలుట్లయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు రేపటి నుంచి న్యూ ఇయర్ వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ను అమలు పరుస్తున్నామని, న్యూ ఇయర్ అంటూ రోడ్లపై కొచ్చి, మద్యం సేవించడం, ద్విచక్ర వాహనాలు తిప్పడం, మద్యం సేవించి, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థ నిబంధనలను ప్రజలు తూచా తప్పక పాటించాలని, డిసెంబర్ 31 తేదీన సాయంకాలం 4గంటల నుండి జనవరి 1వ తారీఖు ఉదయం 9 గంటల వరకు హోటల్స్, రెస్టారెంట్స్, డాబాలు, మద్యం దుకాణాలు.మూసివేయాలన్నారు.మద్యం సేవించి రోడ్లపై వాహనాలతో యువకులు తిరుగుతూ కనిపిస్తే కేసులు పెడతామని సీఐ హెచ్చరించారు. శింగనమల సర్కిల్ పరిధిలోని. శింగనమల, గార్లదిన్నె, నార్పల మండలాలలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు, అల్లర్లకు, తావు లేకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. న్యూ ఇయర్ అంటూ యువకులు విచ్చలవిడిగా మధ్యం సేవించి, వాహనాలు నడుపుతూ, మీ అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని, ఈ విషయాన్ని ప్రజలు, యువకులు ముఖ్యంగా యువత వారి తల్లి, దండ్రులు గమనించి పోలీసు వ్యవస్థ ఇచ్చిన నిబంధనలను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని సీఐ కౌలుట్లయ్య విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *