పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ డిసెంబర్ 30.12.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) ప్రతి సోమవారం మండల హెడ్ క్వార్టర్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించిన బాధితులు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తాం. సమస్యలు పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటాం. కూటమి నాయకులు, కార్యకర్తలు అధికారులను భయబ్రాంతులకు గురిచేసి తమ చెప్పుచేతుల్లో ఉంచుకుని కార్యకలాపాలను చక్కదిద్దుకుంటున్నారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు. పరిష్కారం కాని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం జరిగేలా చర్యలు చేపడతాం. పుంగనూరు ఎమ్మెల్యే మాజీ (మంత్రివర్యులు) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..