పయనించే సూర్యుడు 31-12-2025 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో మంగళవారం నాయి బ్రాహ్మణ కుల సంఘ సభ్యులు నూతన కమిటీని ఎన్నుకున్నారు, నూతనంగా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఎనగందుల గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా ఎనగందుల లక్ష్మీరాజ్యం, ఉపాధ్యక్షులుగా ఎనగందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల అశోక్, సహాయ కార్యదర్శిగా ఎనగందుల రమేష్, ప్రచార కార్యదర్శిగా ఎలగందుల తిరుమలేష్, కోశాధికారిగా ఎలగందుల నాగరాజ్, ముఖ్య సలహాదారుగా ఎలగందుల శంకర్, ను సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం నూతనగా ఎన్నికైన నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎనగందుల గంగాధర్, మాట్లాడుతూ. మన కుల సంఘం అభివృద్ధికి మీ అందరి సహకారంతో ముందుకు సాగుతానని ఎలాంటి సమస్య అయినా సమన్వయంతో పరిష్కారం చేసుకోవడానికి ముందు ఉంటానని నా కుల సంఘ బంధువులకు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కుల సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.