పయనించే సూర్యుడు: డిసెంబర్ 31: అనంతపురం జిల్లా గుత్తి మండలం రిపోర్టర్: బి నిజాముద్దీన్ వార్తా విశ్లేషణ: అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తి కోటకు రహదారి రోప్‌వే ఏర్పాటు చెయ్యాలని గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో కొత్తపేట వద్ద నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి వై రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్త పేట నుండి కోట పైకి రహదారి నిర్మిస్తే జాతీయ రహదారుల నుండి నేరుగా కోటపైకి వాహనాలు పోతాయి అని తద్వారా కోటకు పర్యాటకులు పెరుగుతారు అని, టూరిజం కూడా అబివృద్ధి చెందుతుంది అన్నారు. కోట పైకి కనీస వసతులైన నీళ్లు కరెంట్ ఏర్పాటు చేయాలన్నారు. అతి పురాతనమైన కట్టడాలను పునర్నిర్మాణం చేయాలన్నారు. వాటి చరిత్రను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కోటపైన పురాతన దేవాలయా లు ధ్వంసం అయ్యాయని వాటిని పునర్నిర్మాణం చేయాలని ప్రభుత్వం కుసూచించారు. కోటవద్ద హరిత హోటల్ పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ సందర్శించి రోడ్ వేస్తామని చెప్పారు వెంటనే నిధులు కేటాయించి ప్రభుత్వం పనులు చేపట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తి కోట సరక్షణ సమితి ఉపాధ్యక్షుడు కాశీ రావు కన్వీనర్ కోటేశ్వరరావు సభ్యులు సతీష్ విజయ్ నికిల్ సుధాకర్ సాయి తదితరులు పాల్గొన్నారు.