పయనించే సూర్యుడు డిసెంబర్ 31, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకానిమండల పరిధిలోని తిమ్మినేనిపాలెం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు నవీన్ శర్మ ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు.భక్తులు ఆలయాన్ని రంగు రంగు పూలతో అలంకరించారు. మహావిష్ణు అవతారస్వరూపుడైన శ్రీరాముడు భక్తజనావళికి దేవాలయం ఉత్తరద్వారం నుండి దర్శనమిచ్చారు. గోవిందా గోవిందా జైశ్రీరామ్ అంటూ భక్తులు ఆనంద పారవశ్యంతో పులకించిపోయారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుచ్చిబాబు,నరేశ్ బాబు, బద్రి కాశి ,పోటు కృష్ణ, ఉమరావు, బద్రి నాగేశ్వరరావు, గోదా మంగయ్య,ఆళ్ళ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.