ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా

* శిల్పా–లక్ష్మీ నగర్‌లో సుకుమార్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు / మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ నాగారం డిసెంబర్ 31 నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శిల్పా నగర్, లక్ష్మీ నగర్ కాలనీలో లబ్ధిదారుడు తాటిపర్తి సుకుమార్ నిర్మించుకున్న నూతన ‘ఇందిరమ్మ ఇల్లు’ గృహప్రవేశ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు నాగారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరై, శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసిన సుకుమార్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేదల సొంతింటి కలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గూడు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. లబ్ధిదారుడు సుకుమార్ తన సొంతింటి కలను నెరవేర్చుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన నాయకులు, నూతన గృహంలో అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు అందజేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు: ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు, సుకుమార్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గృహప్రవేశ వేడుకను జయప్రదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *