పయనించే సూర్యుడు న్యూస్ 31 డిసెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ : యాచారం మండల కేంద్రంలో యూరియా కొరకు రైతులు ఎలాంటి ఆందోళన చెందిందని వ్యవసాయ అధికారి రంగనాథ్ తెలిపారు. రెండు రోజుల్లో రైతులకు సరిపడా యూరియా మండల కేంద్రానికి అందుతుందన్నారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా తగినంత అందుబాటులో ఉంటాయని, కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా యూరియా లో ఉన్న నత్రజని ఉంటుందని తెలిపారు. ఏ విధమైన పంట అయినా వాడొచ్చని స్పష్టం చేశారు