ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్అండ్ కొమిరిశెట్టి ఫౌండేషన్నేతృత్వంలో ముత్యాల ముగ్గులపోటీలు

పయనించే సూర్యుడు, డిసెంబర్ 31 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలే పండుగలు. సంక్రాంతి పర్వది నాన్ని పురస్కారించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొమిరిశెట్టి ఫౌండే షన్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలో గల 35 కాల నీలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కాల నీలో పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ 5 ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగు తుంది. దీనిలో భాగంగా మంగళవారం పాపిరెడ్డి కాలనీలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. విజే తలకు బహు మతి ప్రదానం చేసిన అనంతరం కొమిరి శెట్టి ఫౌండేషన్ అధ్యక్షులు కొమిరిశెట్టి సాయిబాబా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియే షన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవులు మాట్లాడుతూ ” పరిశు భ్రత,ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు” అని అన్నారు. “ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుంది. పట్టణీకరణ నేప థ్యంలో అపార్టుమెం ట్ల సంస్కృతి పెరిగిన తరువాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు నానాటికి కనుమరుగవు తున్నాయి. నేటి యువత రంకూడా మన ప్రాచీన సంస్కృతి, సంప్ర దాయాలు కొనసాగించేందుకై ఈ పోటీలు నిర్వహి స్తున్నాము”అని అన్నారు. “ఈ ముగ్గుల వలన పరిసరాలు పరిశుభ్రతగా ఉంటా యి. గోమయంతో కళ్ళాపి జల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేయడం వలన బియ్యపు పిండి తినడానికి చీమలు చేరతాయి. ఆ విధంగా చీమలు క్రిమి కీటకాదులు ఇంటిలోనికి రాకుండా అడ్డుకుంటాయి. ఈ ముగ్గులు వేసే ప్రక్రియలో మహిళలు అనేక శరీరక భంగిమలలో పనిచేయ వలసి ఉంటుంది. ఈ వ్యాయామ ప్రక్రియ వలన మహిళ లలో అనేక గర్భకోశ వ్యాధులు రాకుండా ఉండేందుకు అవ కాశం ఉందని వైద్యులు తెలిపారు. కావున ప్రతి మహిళ కూడా ప్రత్యేకించి ఈ ధనుర్మాసం మొత్తం నెల రోజులు అత్యంత ఉత్సాహంగా వేకువ ఝామున లేచి ముగ్గులు వేయడం ప్రారంభిస్తారు” అని అన్నారు. ఈ పోటీ లలో విజయలక్ష్మి రమ్య విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీలలో 30 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక మహిళా నాయకురాలు జ్యోతి, స్వప్న, ఆదిలక్ష్మి, రాణి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అమ్మ య్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *