పయనించే సూర్యుడు డిసెంబర్ 31 నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా బీసీ సంక్షేమ సంఘంలో కీలక మార్పు చోటుచేసుకుంది. జిల్లాలోని కార్వంగా గ్రామానికి చెందిన చౌదర్ల రేణుకను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఘనంగా నియామక పత్రం అందజేత: హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, తెలంగాణ బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి. పద్మ చేతుల మీదుగా రేణుక నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఆమెను శాలువాలతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. బాధ్యతాయుతంగా పనిచేస్తా, ఈ సందర్భంగా చౌదర్ల రేణుక మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఆర్. కృష్ణయ్యకు, జి. పద్మకు మరియు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన నియామకానికి సహకరించిన ముదగుల తిరుపతయ్య, రామకృష్ణ, ఎం. నిరంజన్లకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బీసీల సంక్షేమం కోసం, మహిళా హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతానని, జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా ముందుంటానని ఈ సందర్భంగా రేణుక ప్రకటించారు