పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31 బోధన్: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్యవర్గ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీగా ఏర్పడటం వలన అట్టి పోస్టుని రెంజల్ మండలానికి చెందిన మూడుసార్లు రెంజల్ మండల అధ్యక్షులుగా బంజారా జాతికి సేవ చేసినటువంటి జాదవ్ గణేష్ నాయక్ వారిని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా కార్యవర్గ సభ్యులు అందరు అభిప్రాయాలు సేకరించి మంగళవారం జిల్లా అధ్యక్షులు బాబురామ్ నాయక్ ,జాతీయ ఉపాధ్యక్షులు బాదావత్ తార చంద్ నాయక్, జిల్లా అధ్యక్షులు బుక్య చంద్రు నాయక్, వారి చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మూడ్ తార తారాచంద్ నాయక్ దేగావత్ దూప్ సింగ్ నాయక్ జాదవ్ ప్రవీణ్ నాయక్ మరియు బోధన్ మండల అధ్యక్షులు విశ్వనాధ్ నాయక్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ మండల విభాగం యువజన అధ్యక్షులు కొర్ర బంతిలా నాయక్ బెల్లాల్ సర్పంచ్ రామావత్ రాజు నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు