పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి1 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ సెక్రటరీ బట్రెడ్డి జనార్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన పోరాటం కొనసాగించాలని ఆకాంక్షించారు. అలాగే అనంతసాగరం గ్రామం, మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.