
పయనించే సూర్యుడు న్యూస్ 01-01-2026, మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, ఉద్యోగుల జీవితంలో పదవీ విరమణ అనేది తప్పనిసరిని పెద్దపల్లి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని కల్పనా అన్నారు. బుధవారం మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ సలీం పదవి విరమణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సయ్యద్ సలీం 30 సంవత్సరాలకి పైగా ఉపాధ్యాయ, అధ్యాపక జీవితంలో ఎంతోమంది ఉన్నత స్థానాల్లో నిలవడానికి కారణమయ్యారన్నారు. విధుల్లో అందరితో సరదాగా ఉంటూనే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని క్రమశిక్షణలో పెట్టడంలో ముందుంటారన్నారు. తమతో ఎన్నో ఏళ్ళుగా కలిసి పనిచేసిన సలీం తమ విధుల నుండి దూరం అవుతున్న బాధ ఎంతో ఉంటుందని ఆయన తన శేష జీవితాన్ని ఆనందోత్సవాలతో కుటుంబల మధ్య గడపాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయ స్థాయి నుంచి కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసే నేడు పదవీ విరమణ పొందిన సయ్యద్ సలీం సేవలను కొనియాడారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట డిఐఈఓ , ప్రిన్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రవీందర్ రెడ్డి, మంచిర్యాల డి ఐ ఈ ఓ అంజయ్య, జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపళ్ళు కే రామచంద్ర రెడ్డి, సంజీవయ్య, రవీందర్ రెడ్డి, విశ్వ ప్రసాద్, సుధాకర్, ఉష, రిటైర్డ్ ప్రిన్సిపళ్ళు అంబరీష్, లయాకలీ ,పెద్ద సంఖ్యలో పూర్వ , ప్రస్తుత విద్యార్థులలో పాటు అభిమానులు పాల్గొన్నారు.