పయనించే సూర్యుడు జనవరి 01 ఆదోని నియోజకవర్గ క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బడ్జెట్ సమావేశం కోసం 11 గంటలకు వచ్చామని తెలిపారు.12-20గంటలైన కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కాకపోవడం చాలా విచారకరమని,ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు గాలికి వదిలేసి, ఇంతవరకు అధికారులు, చైర్మన్ తో పాటుగా వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్లు సమావేశానికి సరైన సమయానికి రాకుండా ప్ నిర్లక్ష్యం చేయడం ఏమిటని నిలదీశారు. సమావేశం ఉందా లేదా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పష్టత ఇవ్వకుండా అధికారులు నీళ్లు నమిలారు.