పయనించే సూర్యుడు, 01-01-2026 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) నల్లగండ్ల,తెలాపూర్ ప్రాంతాల్లో ఐ ఐ టీ -జె ఈ ఈ, నీట్ ఫౌండేషన్ తయారీలో ప్రముఖ సంస్థగా పేరొందిన విద్యాసాగర్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎక్స్ల్లెంస్ నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహభరి తంగా నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు మరియు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో జనవరిలో జరగనున్న ఐ ఐ టీ -జె ఈ ఈ పరీక్షలకు హాజరుకాబో తున్న విద్యార్థు లకు ప్రత్యేకంగా ప్రోత్సా హక సందేశాలు అందించారు.విద్యార్థుల సిద్ధతపై యాజమాన్యం పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ, వారి విజయానికి శుభా కాంక్షలు తెలిపింది.అదేవిధంగా,విద్యా సాగర్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎక్స్ల్లెంస్ ఒక ఆశాజనకమైన, అభివృద్ధి చెందుతున్న జూనియర్ కాలేజీగా ప్రస్తుత విద్యా సంవత్సరంనుండి తరగతులు ప్రారంభిం చనున్నట్లు ప్రకటించింది.ఈ జూనియర్ కాలేజీ లో ఎంపీసీ,బైపీసీ, ఏంఈసిసి ఈ సి కోర్సులు అందుబాటులో ఉండనున్నా యని, బలమైన అకడమిక్ ఫౌండేషన్, కాన్సెప్చ్యువల్ క్లారిటీ,కాంపి టీటివ్ ఎక్సమ్ ప్రేపరషన్ పై ప్రత్యేక దృష్టి సారి స్తామని తెలిపారు.అదనంగా,ప్రతి భావం తులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిం చనున్నట్లు ప్రకటిస్తూ,విద్యా ప్రతిభను ప్రోత్సహించడం అర్హులైన విద్యార్థులను ఆదుకోవడమే సంస్థ లక్ష్యమని వెల్లడించా రు. ఈ కార్యక్రమం నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు విజ యవంతులైన విద్యార్థు లను తీర్చిదిద్ద డంలో సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటి స్తూ,సానుకూల వాతావ రణంలో ముగిసింది.