పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 01.01.2026అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మండల కేంద్రమైన చౌడేపల్లి లో ముక్కోటి ఏకాదశి తరువాత ద్వాదశి దినాన గరుడ వాహనముపై శ్రీ వేణుగోపాలస్వామి ఊరేగింపు కన్నుల విందుగా జరిగింది ఊరేగింపు ఎదుట చెక్కభజనలు కోలాటలు వివిధ గ్రామీణ నృత్యాలు భక్తులను అలరించాయి పట్టణంలోని అన్ని విధుల గుండా స్వామి వారిని ఊరేగించారు భజన మందిరం దగ్గర గల పుష్కరిణిలో చక్రస్థానం శాస్త్ర సంబంధం గా వైభవముగా జరిగినది ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానికులు పాల్గొన్నారు
