పయనుంచే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 02.01.2026 అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో నూతన సంవత్సరం త్రయోదశి సందర్భంగా అమ్మవారికి ఉదయమే ఆలయ అర్చకురాలు పంచామృత అభిషేకం చేసి రంగురంగు పూలతో అమ్మవారిని అలంకరించారు పుంగనూరు చౌడేపల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈ రోజు ఉభయ దారులుగా బండ్ల పల్లెకు చెందిన కృష్ణారెడ్డి సుమిత్రలు వ్యవహరించారు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు