శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న డిసిపి లక్ష్మీనారాయణ ఏసీపీ ఎబిజి తిలక్, సీఐ వెంకటేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 3 పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని ఈరోజు డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తిలక్, జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, పెనుగంచిప్రోలు ఎస్సై అర్జున్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది వారికి ఘన స్వాగతం పలికి, వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *