పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 3 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ ఇ శ్రీనివాసులు కు గ్రీన్ ఆర్మీ, ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షులు బోనెల గోపాల్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.పలాస ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని,పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని తెలుపుతూ కమిషనర్ కు వినతిపత్రం ను అందజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలే తగ్గించుకొనేతట్లు అలవాటు పడాలని, క్యాన్సర్ వంటి రోగాలు నుండి బయట పడాలని , ప్రజలు శుభ్రత పరిశుభ్రత పాటించాలని కోరారు. వార్డులకు మున్సిపల్ వాహనం వచ్చేటప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరుచేసి బండిలో నేరుగా వేయాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అయి ప్రభుత్వం నిర్వహించే ప్రతి శనివారం కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారి పొట్నూరు శ్రీనివాసరావు, రైల్వే అధికారి దివాకర్, ఉపాధ్యాయులు బీర.అప్పారావు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సీర. నాగేశ్వరరావు, ఎన్జీవో నాయకులు, గ్రీన్ ఆర్మీ సభ్యులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.