అరచేతి ముగ్గుల ఖ్యాతి చాటనున్న “ఆంధ్రజ్యోతి”

* ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో షాద్ నగర్ లోముత్యాల ముగ్గుల పోటీ.. * కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ * బుగ్గారెడ్డి గార్డెన్ వేదికగా జనవరి 4న ఆదివారం కార్యక్రమం.. * గెలుపొందిన ముగ్గురికి ప్రత్యేక బహుమతులు, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి

పయనించే సూర్యుడు జనవరి 02 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ మహిళల అరచేతితో వేసే అందమైన ముగ్గులు వారి ప్రతిభను సూచిస్తాయి.. ప్రస్తుతం ముగ్గుల్లో రాష్ట్రస్థాయిలో తమ ఖ్యాతిని చాటే దిశగా ఆంధ్రజ్యోతి అవకాశం కల్పిస్తుంది. ఇందులో భాగంగా సంక్రాంతి ముగ్గుల పోటీలను ఈ నెల నాలుగో తేదీ షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్ లో నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి ఇన్చార్జ్ టంగుటూరి సంజయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ లు లట్టుపల్లి మోహన్ రెడ్డి, భవాని వేణుగోపాల్, అదేవిధంగా సీనియర్ “జర్నలిస్ట్ కేపీ” లతోపాటు కాంగ్రెస్ నాయకులు రఘు, చెంది తిరుపతిరెడ్డి, అగ్గనూర్ బస్వం, మాజీ జెడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, లైబ్రేరియన్ రాజు, ఎమ్మే సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చేసింది ముగ్గుల పండుగ జనవరి 4వ తేదీన షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్స్ లో ముత్యాల ముగ్గుల పోటీ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో జరగనున్న ముత్యాల ముగ్గుల పోటీకి మహిళలు పెద్ద ఎత్తున హాజరుకావాలని తగిన బహుమతులు పొందాలని ఆంధ్రజ్యోతి పీసీ ఇంచార్జ్ సంజయ్ కుమార్, లట్టుపల్లి మోహన్ రెడ్డి, భవాని వేణుగోపాల్ ఒక ప్రకటనలో కోరారు. సంక్రాంతి కలంత ముగ్గుల్లోనే కనిపిస్తుందని ఆ ముగ్గుల కలంత వేలికొనలోనే దాగి ఉంటుందనీ ఆ అద్భుత కళకు ఆంధ్రజ్యోతి ఏబీఎన్ నీరాజనం పడుతుందని తెలిపారు. ముత్యాల ముగ్గుల పోటీలో ప్రధమ బహుమతి 6వేలు నగదు, ద్వితీయ బహుమతి 400 నగదు, తృతీయ బహుమతి మూడువేల రూపాయలు నగదు విజేతలకు అందజేయునట్లు వివరించారు. పోటీలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. నిబంధనలు విద్యార్థినిలు మహిళలు మాత్రమే పాల్గొనాలి, ముగ్గులకు కావలసిన రంగులు వగైరా పోటీదారులే తెచ్చుకోవాలి, ముగ్గు వేయడానికి కేటాయించిన సమయం రెండు గంటలు మాత్రమే, చుక్కల ముగ్గులకు ప్రాధాన్యత ఇవ్వబడును. ముత్యాల ముగ్గుల పోటీలో పాల్గొన్న వారు జనవరి మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపే ఈ క్రింది సెల్ నెంబర్లకు ఫోన్లు చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని వారు కోరారు. టి సంజయ్ కుమార్ 9866814961, ఎల్ మోహన్ రెడ్డి 9440645455, శేఖర్ యాదవ్ 9494828646, రామచంద్రయ్య 9390251506, భవాని వేణుగోపాల్ 98485680 89, రవికుమార్ 9908 991315, మల్లేష్ 9705277052, వెంకటేష్ 9866 951343, చందు ఏబీఎన్ 9866 551718 నంబర్లకు ఫోన్లు చేసి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *