పయనించే సూర్యుడు : జనవరి 3 : హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి : హుజురాబాద్ సిఐ కరుణాకర్ కు ఉత్తమ సేవా పథకం వరించిన సందర్భంగా ఆయనకు ఘన సన్మానం చేసిన బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు. హుజురాబాద్ లో మంచి సేవలు, నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల వివరణ వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తున్నారని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సిఐ కరుణాకర్ కు ఉత్తమ సేవా పథకం రావడం తో హుజురాబాద్ పట్టణ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు,హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు,బిసి ఆజాది ఫెడరేషన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.