సాంకేతిక శిక్షణే విద్యార్థుల భవిష్యత్‌కు పునాది

* టెక్నాలజీతోనే పోటీ ప్రపంచంలో విజయం * ఉట్నూర్ సర్పంచ్ జాధవ్ అనిత శ్రీనివాస్

పయనించే సూర్యుడు జనవరి 03 ఉట్నూర్ ప్రతినిధి ఉట్నూర్:- మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలని ఉట్నూర్ సర్పంచ్ జాధవ్ అనిత శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ ఐటీఐ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌ (ఏటీసీ)ను ఆమె సందర్శించారు ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన ఆధునిక శిక్షణ సదుపాయాలు యంత్రాల పనితీరును ప్రిన్సిపల్ శ్రీనివాస్ వివరించారు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే విద్యార్థులు నైపుణ్యాలు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం తప్పనిసరి అని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *