పెండింగ్ లో ఉన్న సేవరేజ్ పైప్ లైన్పనులను కాలనీ వాసులతో కలసి పరిశీలించిన: నార్నె శ్రీనివాసరావు.

పయనించే సూర్యుడు, జనవరి 03 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎం టి శాతవాహన కాలని చేపట్టవలసిన, పెండింగ్ లో ఉన్న సేవరేజ్ పైప్ లైన్ పను లను జలమండలి మేనేజర్ వారి సిబ్బం ది, కాలనీ వాసులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు. ఈ సంద ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..కాలనీ వారి విజ్ఞప్తి మేరకు జలమండలి అధికా రులతో పర్యటించి సెవెరేజ్ లైన్ కలవటం లేదని తెలిసి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో కలసి చర్చిం చి, పరిష్కారం చూపి, పనులను వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు చెప్ప డం జరిగిం ది అలానే పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మా దృష్టికి వచ్చి న సమస్యలను పరిగణలోకి తీసు కొని ప్రత్యేక చొరవతో డివిజన్ లో అత్యవ సరం ఉన్న చోట, నిత్యం సమస్య లతో ఉన్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివా సరావు తెలియ చేశారు. ఏ చిన్న సమస్య అయిననా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తా మని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాల నీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథం లో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమై న కాలనీలుగా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన,చక్కటి ఆహ్లాదక రమైన వాతావరణం కలిపిస్తా మని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందు బాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగా మి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ విలియమ్ ప్రకాష్, సూపర్వైజర్ నరేంద్ర వారి సిబ్బంది, జిహెచ్ఎంసి ఇంజ నీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వెల్ఫేర్ అసో సియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *