పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా, సెంటినరీ కాలనీ, జనవరి-3:- సింగరేణి రామగుండం -3 ఓసీ1లో పనిచేస్తున్న ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు మునిశెట్టి నరేష్ కుమార్ (డ్రిల్ ఆపరేటర్), మేకల చంద్రమౌళి (ఈపీ ఆపరేటర్) మల్లాడి సమ్మిరెడ్డి (ఈపి ఆపరేటర్)లు ఐఎన్టియుసి అనుబంద సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ లో చేరారు.సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఎర్రజెండా యూనియన్ కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడంతో, యూనియన్ పై నమ్మకం కోల్పోయి నిమ్మకు నీరేత్తినట్టు ఉన్న సందర్భంలో కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఐఎన్టియూసి సెక్రెటరీ జనరల్ మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో ఆకర్షితులై, కార్మికుల కోసం ఐఎన్టీయూసీలో పనిచేస్తామని ముందుకు వచ్చిన నరేష్ కుమార్, చంద్రమౌళి, సమ్మిరెడ్డి ను ఆహ్వానిస్తూ ఐఎన్టియుసి కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ ఆర్జి3 ఓసి1లో ఉద్యోగుల సమక్షంలో ఐఎన్టియూసి కండువా కప్పి స్వాగతించారు.రెండు సంవత్సరాలు గడిచిన దీర్ఘకాలిక సమస్యలతో కార్మికులు బాధపడుతున్నారని, ఐఎన్టియూసి ఒక్కటే కార్మికుల పోరాటంలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
