మంథని అభివృద్ధికి మారుపేరు దుద్దిళ్ల శ్రీధర్ బాబు

* ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు * గుండారం అభయాంజనేయ స్వామి ఆలయానికి ధూప–దీప నైవేద్య నిధుల మంజూరు * మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా, సెంటినరీకాలనీ జనవరి-3 : మంథని నియోజకవర్గ అభివృద్ధికి గుండారంమారుపేరుగా నిలిచిన వ్యక్తి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని కమాన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో ఆయన చూపుతున్న చొరవ వల్లే మంథని నియోజకవర్గం నిరంతర అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి ధూప–దీప–నైవేద్యాల నిర్వహణ కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం గుండారం గ్రామ టప్ప వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిడుగు శంకర్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైనాల రాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, మంథని నియోజకవర్గానికి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించిన ఘనత దుద్దిళ్ల కుటుంబానికే చెందుతుందని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ఆలయాల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల ఓదెలు, అడబాల చంద్రయ్య, ఉప సర్పంచ్ అంబీరు రాజేందర్, ఆలయ ధర్మకర్తలు దండే సదయ్య, అరిష ఎల్లయ్య, వార్డు సభ్యుడు దామెర దేవయ్య, పిడుగు సదయ్య, వి.ఎస్.ఎస్. రాజేష్, ముకుంద శ్రవణ్, ముధం కొమురయ్య, పిడుగు పోచమల్లు, గరిగంటి సదయ్య, సింగం అశోక్, వడ్లకొండ అభిరామ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *