పయనించే సూర్యుడు జనవరి 4 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) మహిళల చదువు,అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిభాయి ఫూలే ఘనంగా సావిత్రి భాయి ఫూలే 195వ జయంతి మహిళల చదువు,అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిభాయి ఫూలే ఆశయ సాధనకు నేటి విద్యార్థులు, యువత కృషి చేయాలని అన్నారు. సావిత్రిభాయి ఫూలే 195వ జయంతిని డిండి మండలంలోని గోనకోల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులకు శాలువతో సత్కరించడం జరిగింది మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా పేరు గడించారన్నారు. 19వ శతాబ్దపు ఆనాటి అజ్ఞానపు చీకట్లను చీల్చుతూ బానిస సంకెళ్లను తెంచి సమాజంలో మహిళలకు, వితంతువులకు, బాలికలకు, అణగారిన వర్గాలకు విద్య, గౌరవాన్ని సాధించిన విదుషీమణి సావిత్రిబాయి అని వారు అన్నారు. సావిత్రిబాయి జన్మదినాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళోద్ధరణకు సావిత్రిబాయి చేసిన సేవలు అనన్యం అసామాన్యం అని అన్నారు. సావిత్రిబాయిని భారతీయ మొదటి తరం స్త్రీవాదిగా వర్ణిస్తారన్నారు. సావిత్రీబాయి మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో, 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించిందన్నారు. సావిత్రి బాయికి 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు పూలేతో 1840లో వివాహం జరిగిందని. నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు అన్నారు. జ్యోతీరావు పూలె ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. కొల్హాపూర్ లోని ఫర్రార్ ఇనిస్టిట్యూట్లో ఉపాధ్యాయ శిక్షణపొంది, 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి అణగారిన కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించిందని, ఇలా పాఠశాల ఏర్పాటు చేసి నడపటం ఉన్నత వర్గాలకు నచ్చలేదన్నారు. దీంతో ఆమెపై వేధింపులకు పూనుకున్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, సతీసహగమనానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారన్నారు. మగవారికి మాత్రమే చదువుకునే పరిస్థితులలో నుండి ఆడవారు కూడా చదువుకునే స్థితికి తీసుకొచ్చిన మహా గొప్ప వ్యక్తి అని అన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హీనా, యాదయ్య, ఏఐఎస్ఎఫ్ దేవరకొండ డివిజన్ అధ్యక్షులు సురిగి వినయ్ కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు కామేపల్లి కళ్యాణ్, దీపిక, ప్రవీణ్, విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.