అగ్రిమెంట్ లేదు ఓన్లీ స్కాం

* ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న సాగులో రెచ్చిపోతున్న బ్రోకర్లు * రైతులను నిండా ముంచే ప్రయత్నాలు * రైతులను మోసం చేస్తున్న మొక్కజొన్న సీడ్ కంపెనీలు * మొక్కజొన్న సాగు లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా నడుపుతున్న కంపెనీలు * స్థానిక వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకొని ఇష్టానుసారంగా అక్రమ దందా నడుపుతున్న మొక్కజొన్న సీడ్స్ కంపెనీ యాజమాన్యం

పయనించే సూర్యుడు జనవరి 04 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: ఏజెన్సీ ప్రాంతాల్లో విత్తన మొక్కజొన్న సాగులో ఆర్గనైజర్లు కంపెనీలు అగ్రిమెంట్ లేకుండా రైతులను మభ్యపెడుతూ చాలా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఆర్థికంగా నష్టాల బారిన పడేస్తుంది,రైతులను మానసికంగా ఇబ్బందులను గురి చేస్తున్నారు, అధిక నికర ఆదాయం ఆశ చూపించి పెట్టుబడులు ఎరువులు ఇస్తామని నమ్మించి చివరికి మద్దతు ధర బకాయిలు చెల్లించకుండా పారిపోతున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న సాగు లో ప్రధాన సమస్య అగ్రిమెంట్ లేకుండా రైతులతో పంట సాగు చేపించుకొని డబ్బులు చెల్లించకుండానే పారిపోతున్నారు దీనితో పంట నష్టం కలిగినప్పుడు రైతులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు వీటితోపాటు ఏజెంట్ల పరారీ సొమ్ము చేసుకుని కనిపించకుండా మాయమైపోతున్నారు రైతులను మాయ మాటలు చెప్పి అగ్రిమెంట్ అనేది లేకుండా వేల ఎకరాలకు నాసిరకం విత్తనాలు ఇవ్వడం అవి సరిగా దిగుబడి రాకపోవడంతో రైతులను తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నారు అగ్రిమెంట్ లేకపోవడం పరిహారం కోసం రైతులు తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం ఈ తతంగం జరుగుతూనే ఉన్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు నిఘా లేకపోవడం విత్తన కంపెనీలు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం ఆశించిన దిగుబడి రాకపోతే పట్టించుకోకపోవడం సర్వసాధారణంగా మారింది రైతులకు మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి అధికారులు సలహాలు సూచనలు అవగాహన సదస్సు కార్యక్రమాలు ఏర్పాటు చేసి సూచనలు ఇస్తున్నప్పటికీ మొక్కజొన్న సాగు చేసే ముందు కంపెనీలు ఆర్గనైజర్ల ద్వారా అగ్రిమెంట్ తీసుకోవాలి పంట నమోదు సాగు చేసే ప్రతి రైతు తమ పంటను వ్యవసాయ శాఖ ద్వారా నమోదు చేసుకోవాలి నమ్మకమైన కంపెనీలు గుర్తింపు పొందిన విత్తనాలు కొనుగోలు చేయాలి రైతులు మోసపోకుండా ఉండేందుకు ఆర్గనైజర్లతో అగ్రిమెంట్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు పదేపదే సూచిస్తున్న కంపెనీలకు ఆర్గనైజర్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నటువంటి స్థానిక వ్యక్తులు ఏజెంట్లు బ్రోకర్లు గా ఏర్పడి రైతులను మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు చట్టపరంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి కంపెనీల ఆర్గనైజర్ల ఏజెంట్ల పై కేసులు నమోదు చేసి రైతులు మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకొని నకిలీ విత్తనాల కంపెనీ ఆర్గనైజర్లు ఏజెంట్ల ను గుర్తించి కేసు నమోదు చేసి రైతులకు నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి విత్తన కంపెనీ ఆర్గనైజర్లు ఏజెంట్లు లకు ప్రజా ప్రతినిధులు పరోక్షంగా సహకరిస్తున్నారు అనే ఆరోపణలు సైతం రైతుల నుంచి వినపడుతున్న సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *