ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 04 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి జడ్పీహెచ్ఎస్ కోరపల్లి పాఠశాలలో శనివారం రోజు సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులైన కే పద్మ ఎస్.ఏ. హిందీ, ఆర్. గీతా కుమారి జూనియర్ అసిస్టెంట్, ల ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పూలే గారు చేసిన సేవలు మరియు సమాజానికి ఆమె అందించిన బాల్య వివాహ నిషేధం, మహిళలందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఆమె చేపట్టిన పలు సంస్కరణలను వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *