పయనించే సూర్యుడు జనవరి 4 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న) జనగామ జిల్లా దేవరుప్పుల మండలం, చిన్నమాడుర్ గ్రామంలో కొలిపాక లక్ష్మీనారాయణ అనే వ్యక్తి నిన్న రాత్రి రెండు గంటల సమయంలో శివాలయంలోకి అక్రమంగా ప్రవేశించి హిందు దేవతలను దూషిస్తూ శివాలయంలోని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం, శ్రీకృష్ణుని విగ్రహం, నందీశ్వర విగ్రహం, కుజుడి విగ్రహం, గణపతి విగ్రహం,పార్వతీదేవి విగ్రహం, నాగ ప్రతిమలు, అష్టోత్తర శత లింగం వీటితోపాటు మైక్ సిస్టం, కరెంటు మోటర్ మొదలగునవి ధ్వంసం చేసి గ్రామ ప్రజలు, బజరంగ్దళ్ విశ్వహిందూ నాయకుల సమక్షంలో తానే చేసినట్టు అంగీకరించాడు. కావున దీని వెనుక ఉన్నటువంటి నిందితులను హిందూ విద్రోహశక్తులను వదిలి పెట్టకుండా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని దేవరప్పుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దుబ్బ రాజశేఖర్ గౌడ్, పెద్దగౌని రాజు, మడికొండ మహేష్, మడికొండ కరుణాకర్, చిన్నమాడుర్ గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ మైదాం జోగేశ్వర్, ముషీగుంపల వెంకటేష్, ఆలయం పూజారి హరికీర్తి నాని శర్మ, మురళి కృష్ణ, శేషగిరిరావు , మాశెట్టి లక్ష్మీనారాయణ, మందటి గణేష్ జొన్నల సంతు, వంగ దశరథ, కెమెడీ చంద్రశేఖర్, కంకటి రాహుల్, తుమ్మల నవీన్, పెండెల వెంకటేష్, పరమేష్ తదితరులు పాలుగోన్నారు.