భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో నిర్లక్ష్యం

* తప్పుడు రక్త పరీక్షా రిపోర్ట్‌తో మహిళ ప్రాణాలపై ప్రమాదం – ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం బహిర్గతం* * పేషెంట్లలో భయాందోళన, ప్రజల్లో ఆగ్రహం

పయనించే సూర్యుడు జనవరి 04 భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో జరుగుతున్న నిర్లక్ష్యం మరోసారి ఆవిష్కృతమైంది. అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు ల్యాబ్‌ విభాగంలో తప్పుడు రిపోర్ట్‌ ఇవ్వడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సరైన నిర్ధారణ లేకుండా చికిత్స ప్రారంభమై ఉంటే ప్రాణహానీ తప్పేదికాదు.పేషెంట్‌ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మహిళ రక్తపరీక్ష కోసం ల్యాబ్‌ను సందర్శించారు. కొద్దిసేపటికి వచ్చిన రిపోర్టులో ప్లేట్‌లెట్‌ కౌంట్‌ ప్రమాదకర స్థాయిలో ఉందని చూపించారు. ఈ రిపోర్టును చూపించి వైద్యులు చికిత్స ప్రారంభించబోతుండగా, పేషెంట్‌ పరిస్థితి స్థిరంగా ఉండటంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి . మళ్లీ ప్రైవేట్‌ ల్యాబ్‌లో రక్తపరీక్ష చేయించగా రిపోర్టు పూర్తిగా సాధారణంగా వచ్చింది. ల్యాబ్‌ టెక్నీషియన్లను ప్రశ్నించగా, “జనం ఎక్కువగా ఉండటంతో బై మిస్టేక్‌ రిపోర్ట్‌ ఇచ్చేశాం” అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. “ఇలాంటి సమాధానం ఎలా ఇస్తారు? ఎవరి ప్రాణాలతో ఆటలాడుతున్నారు?” అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల ప్రాణాలకు సంబంధించి పనిచేయాల్సిన వైద్య సిబ్బందే అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. “ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి. అయితే ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది,” అని రోగులు పేర్కొన్నారు.ఆస్పత్రిలో వైద్య సేవలు కూడా అనుకున్న విధంగా అందడం లేదనే ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఓపీ ప్రారంభమవ్వాల్సి ఉన్నప్పటికీ, పలువురు వైద్యులు ఉదయం 10 గంటల తర్వాతే హాజరవుతున్నారని రోగులు చెబుతున్నారు. కొంతమంది వైద్యులు మధ్యాహ్నం 12 గంటలకే వెళ్లిపోవడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నర్సులు కూడా “రేపు ఉదయం రిపోర్టులు చూపించండి” అంటూ రోగులను తిరిగి పంపుతున్నట్లుగా పలువురు ఆరోపించారు. ల్యాబ్‌ విభాగంలో టెక్నీషియన్ల ప్రవర్తన దురుసుగా ఉందని అనేక మంది రోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి శుభ్రత, మరుగుదొడ్ల స్థాయి దారుణంగా ఉందని రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “మరుగుదొడ్లకు తలుపులు కూడా లేకపోవడం సిగ్గుచేటు. మహిళలకు తీవ్రమైన ఇబ్బంది” అని పలువురు పేర్కొన్నారు.వైద్యుల కొరత ఆస్పత్రి ఫ్లెక్సీలో అన్ని విభాగాలకు వైద్యులు ఉన్నట్లు చూపించినా, వాస్తవానికి జనరల్‌ ఫిజీషియన్‌, ఆర్థోపెడిక్‌, పిల్లల వైద్యుడు, గైనకాలజిస్ట్లు మాత్రమే హాజరు అవుతున్నారని రోగులు పేర్కొన్నారు. ప్రత్యేక వైద్య విభాగాలైన గైనకాలజీ, డెంటల్‌, పలుమనాలజీ , డెర్మటాలజీ వంటి విభాగాలలో వైద్యులు అరుదుగా హాజరవుతున్నారని తెలిసింది. ప్రజల ఆవేదన“ప్రభుత్వ ఆస్పత్రి అంటే సామాన్యుల ఆశ్రయం. ఇలాంటి నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తోంది. ఇక్కడి వైద్య సిబ్బందిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి” అని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓను కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *