రైతును రాజుగా నిలబెట్టే దిశగా కూటమి పాలన మంత్రి ఆనం

పయనించే సూర్యుడు జనవరి 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు హసనాపురం. జనవరి 3 రైతు హక్కులను కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఏఎస్పేట మండలం హసనాపురం గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రైతు హక్కుల పరిరక్షణ వి ఎస్ గత ప్రభుత్వ ద్రోహం మంత్రి ఆనం మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల భూములపై వారి హక్కులనే కాలరాసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. రైతును కౌలుదారుడిగా మార్చే కుట్రను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్‌లోనే రద్దు చేసింది అని ఘాటుగా విమర్శించారు. జగన్ బొమ్మల పాలనకు చెక్ రాజముద్ర పాలనకు శ్రీకారం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోటోలతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఎలాంటి భద్రతా హక్కులు ఇవ్వలేదని ఆరోపించారు. జగన్ బొమ్మలతో దొంగ నోటుల్లాంటి పాస్ పుస్తకాలు పంపిణీ చేసి రైతులను మోసం చేశారు. ఇప్పుడు వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో కూడిన భద్రతా పాస్ పుస్తకాలు ఇస్తున్నాం .అని స్పష్టం చేశారు.ఎన్నికల ముందు రైతులను మభ్యపెట్టే యత్నం ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందే సుమారు 35 లక్షల రైతుల పాస్ పుస్తకాలను మార్చి రాజకీయ లబ్ధి పొందాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందని మంత్రి ఆనం ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోనే 235 గ్రామాల్లో 1.05 లక్షల మందికి పైగా రైతులకు జగన్ ఫోటోతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. రైతు కేంద్రంగా పాలన సీఎం చంద్రబాబు నాయకత్వం రైతుకు అన్నం పెట్టే భూమికి రైతునే రాజుగా చేయడమే కూటమి ప్రభుత్వ విధానం. ప్రతి నెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకు అన్ని గ్రామాల్లో పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ప్రతి నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రైతుల మధ్యకు వచ్చి పాస్ పుస్తకాలు అందజేస్తారు. అని మంత్రి వెల్లడించారు. ప్రజాధన దుర్వినియోగంపై తీవ్ర విమర్శ రీ-సర్వే పేరుతో హద్దురాళ్లపై కూడా జగన్ ఫోటోలు ముద్రించి రూ.650 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి ఆనం తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రూఅప్ ఛార్జీలకు ముగింపు కూటమి ప్రభుత్వ నిర్ణయం గత ప్రభుత్వం ప్రజలపై ట్రూఅప్ ఛార్జీల భారం మోపగా, కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా రద్దు చేసి ప్రజలకు ఊరటనిచ్చిందని మంత్రి స్పష్టం చేసారు 2026 లక్ష్యం . రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన 2026 డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి ఆనం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతానికి ప్రతీకగా నిలవడంతో పాటు, గత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై రాజకీయంగా గట్టి సంకేతంగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *