పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 04 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): పట్టణంలోని స్థానిక విశ్రాంతి ఉద్యోగుల భవనంలో నెలవారి సమావేశం వాసా పుల్లయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల మృతి చెందిన ఉద్దగిరి సోమరాజు మాస్టారి చిత్రపటానికి వి.ఆస్మాండ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు విశ్రాంతి ఉద్యోగులు మాట్లాడుతూ సోమరాజు మాస్టర్ తో ఉన్న అనుబంధాలను, అనుభవాలను, ఆయన చేసిన సేవలను, విశ్రాంత ఉద్యోగులకు ఆయన అందించిన సహకారాన్ని మరువలేనివని కొనియాడారు. అలాగే కార్యదర్శి ఏబీవీ ప్రసాద్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు కొంతమందికి లైఫ్ సర్టిఫికెట్స్ చేయడమైనది. మిగిలిన వారు ఈనెల 5వ తేదీ నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉచితంగా విశ్రాంతి ఉద్యోగులకు లైఫ్ సర్టిఫికెట్ చేయబడునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి విశ్వనాథ్, బి సాల్మన్ రాజ్, జహురుద్దీన్, సజ్జ సత్యనారాయణ,కే అప్పలస్వామి, విల్సన్ బాబు,ఆయుబ్,పి. స్వర్ణకుమారి, పేకల భారతి, సిహెచ్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు.