పయనించే సూర్యుడు జనవరి 4 అవుసుల బాల కృష్ణ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా కు యూత్ అధ్యక్షుడిగా బండారెంజల్ కు చెందిన పాలగడ్డల నవీన్ కుమార్, జనరల్ సెక్రెటరీగా మొహమ్మద్ ఫసుద్దీన్ నియమితులు అయ్యారు. ఈ మేరకు పార్టీ నాయకులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు, యువతని ఏకం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.